
Courtesy : IPL Twitter
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఫీల్డర్ డేనియల్ క్రిస్టియన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అప్పటికే రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న గిల్ జేమిసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అనూహ్యంగా బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి మిడాన్ దిశగా వెళ్లింది. అయితే అప్పటికే అక్కడ వేచివున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ క్రిస్టియన్ ఒకవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కేకేఆర్ 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్టియన్ స్టన్నింగ్ క్యాచ్ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment