
లాథమ్ సెంచరీ
దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ టామ్ లాథమ్ (258 బంతుల్లో 137 బ్యాటింగ్; 11 ఫోర్లు; 1 సిక్స్) అజేయ సెంచరీతో సోమవారం తొలి రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 243 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మెకల్లమ్ (69 బంతుల్లో 43; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (86 బంతుల్లో 32; 1 ఫోర్) రాణించారు. 22 ఏళ్ల లాథమ్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా ఆసియాలో వరుసగా ఈ ఫీట్ సాధించిన యువ ఆసియేతర ఆటగాడుగా నిలిచాడు. పదేళ్ల అనంతరం కివీస్ నుంచి తొలి ముగ్గురు బ్యాట్స్‌మెన్ 30కి పైగా పరుగులు సాధించడం ఇదే మొదటిసారి.