
వెల్లింగ్టన్: ఓపెనర్ టామ్ లాథమ్ (256 బంతుల్లో 121 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు కెప్టెన్ విలియమ్సన్ (91; 10 ఫోర్లు), రాస్ టేలర్ (50 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో అదరగొట్టడంతో శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 2 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 275/9తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 282 వద్ద ఆలౌటైంది.