బుధవారం హైదరాబాద్ వేదికగా భారత్‌తో తొలి వన్డేలో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. సోధి ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతన్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్‌తో ఆఖరి వన్డేలో గాయపడిన సోధి ఇంకా పూర్తిగా కోలకోలేదని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ సృష్టం చేశాడు. " దురదృష్టవశాత్తూ సోధి తొలి వన్డే జట్టు ఎంపికకు అందుబాటులో ఉండడు. తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయితే చివరి రెండు మ్యాచ్‌లకు జట్టు సెలక్షన్‌కు సోధి అందుబాటులో ఆశిస్తున్నాను" అని మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాథమ్ పేర్కొన్నాడు.
ఇక ఈ సిరీస్‌కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వెటరన్ ఆటగాడు టిమ్ సౌథీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఆ జట్టు పేసర్లు మాట్ హెన్రీ, జామిసన్ గాయం కారణంగా భారత పర్యటన మొత్తానికి దూరమయ్యారు.
న్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): లాథమ్ (కెప్టెన్), అలెన్, హెన్రీ నికోల్స్, కాన్వే, చాప్‌మన్, మిచెల్, ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, డౌగ్ బ్రేస్‌వెల్.
చదవండి: Rohit Sharma: 'సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్.. వరల్డ్‌కప్‌కు బలమైన జట్టే లక్ష్యంగా'
Comments
Please login to add a commentAdd a comment