
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అదరగొట్టారు. భారత్‌తో తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన లాథమ్.. పది స్థానాలు ఎగబాకి 18 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 98 పరుగులతో ఆజేయంగా నిలిచిన విలియమ్సన్ 10వ స్థానానికి చేరుకున్నాడు.
ఇక భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగం కానుందున చెరో ఒక్క స్థానం దిగజారి వరుసగా ఎనిమిది, తొమ్మిది ర్యాంక్‌లలో నిలిచారు. మరోవైపు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన గిల్, శ్రేయస్ అయ్యర్ వరుసగా 27, 34 స్థానాల్లో నిలిచారు.
ఇక వీరితో పాటు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్న ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్భాజ్ 21 స్థానాలు ఎగబాకి 48 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం 890 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో పాక్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నారు.
చదవండి: FIFA WC 2022: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు
Comments
Please login to add a commentAdd a comment