Tom Latham Breaks Sachin Tendulkar Record: న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. పుట్టినరోజు నాడు వన్డేల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో (1998లో 134 పరుగులు) ఈ రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. లాథమ్ తాజాగా 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డుతో పాటు లాథమ్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. పుట్టినరోజు నాడు సెంచరీ సాధించిన తొలి కెప్టెన్‌గా లాథమ్ రికార్డు నెలకొల్పాడు.
శనివారం (ఏప్రిల్ 2) నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో 123 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 140 పరుగులు చేసిన లాథమ్ వన్డేల్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ లాథమ్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 146 పరుగులకే చాపచుట్టేయడంతో కివీస్ 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు టామ్ లాథమ్ సారధిగా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: సీఎస్‌కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment