సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్డేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ప్రారంభమయింది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకుంది. లంకతో మూడో వన్డే ఆడిన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోగా, శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. దీంతో వీరి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్‌లు తుది జట్టులోకి వచ్చారు. టీమిండియా టాపార్డర్ దుర్భేద్యంగా ఉండటంతో కివీస్‌కు కష్టాలు తప్పవు. కోహ్లి అద్భుతమైన ఫామ్, గిల్ జోరుకు తోడు రోహిత్ తనదైన శైలిలో చెలరేగితే టీమ్‌కు ఎదురుండదు.
న్యూజిలాండ్ జట్టులో ఒక్కో ఆటగాడిని చూస్తే పెద్ద ఘనతలు కనిపించవు. కానీ జట్టుగా మాత్రం సమష్టితత్వంతో ఎంతటి కఠిన ప్రత్యర్థిపైనైనా పైచేయి సాధించగలదు. పాకిస్తాన్‌లో వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న జట్టు భారత్‌కు చేరుకుంది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు విలియమ్సన్, సౌతీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో టీమ్‌లో అనుభవం తక్కువగా కనిపిస్తోంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డెవన్ కాన్వే,హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, హెన్రీ షిప్లే
Comments
Please login to add a commentAdd a comment