స్నేహ, బిందు... 418 పరుగులు | Two double centuries in in one match | Sakshi
Sakshi News home page

స్నేహ, బిందు... 418 పరుగులు

Published Sat, Aug 8 2015 12:54 AM | Last Updated on Sat, Jun 2 2018 2:19 PM

స్నేహ, బిందు... 418 పరుగులు - Sakshi

స్నేహ, బిందు... 418 పరుగులు

ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి...

ఒకే వన్డేలో ఇద్దరు డబుల్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్:
ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్‌లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో తూర్పు గోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశాఖపట్నం 515 పరుగులతో ఘన విజయం సా ధించింది. తొలుత విశాఖ జట్టు 50 ఓవర్లలో నాలు గు వికెట్లకు 567 పరుగులు చేయగా... తూర్పుగోదావరి 27.5 ఓవర్లలో 52 పరుగులకే ఆలౌటయింది. గురువారం జరిగిన వన్డేలో స్నేహదీప్తి ట్రిపుల్ సెంచ రీ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement