కొలొంబో: లంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ కుమార్.. ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో నోబాల్ వేసిన భువీ.. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ తప్పును చేశాడు. 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరిసారిగా నోబాల్ వేసిన అతను.. 3093 బంతుల తర్వాత తిరిగి నోబాల్ వేశాడు. మొత్తంగా భువీ తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 5 నోబాల్స్ మాత్రమే వేయడం మరో విశేషం.
Bhuvneshwar Kumar has bowled a No Balls after 5 years and 3093 international deliveries.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2021
8 ఏళ్లకు పైబడిన కెరీర్‌లో ఇన్ని తక్కువ నోబాల్స్ వేసిన బౌలర్ కేవలం భువీ మాత్రమే అయ్యిండొచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, భువీ ఖాతాలోని నోబాల్ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే మంగళవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో భువీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 119 వన్డేలు, 21 టెస్ట్‌లు, 48 టీ20లు ఆడిన భువీ.. అతి తక్కువ ఎకానమీతో 247 వికెట్లు పడగొట్టాడు.
That was Bhuvneshwar Kumar's first no-ball after October 2015 😳#SLvIND
— Priya 🦋🦋 (@BabesPatiyala) July 20, 2021
Bhuvneshwar Kumar has bowled a No ball after 6 years in International Cricket. #INDvsSL #INDvSL pic.twitter.com/BNdPE4KVW1
— Noman Views (@Noman2294) July 20, 2021
Comments
Please login to add a commentAdd a comment