Ire Vs NZ 1st ODI Highlights: New Zealand Beat Ireland By One Wicket, Check Score Details - Sakshi
Sakshi News home page

IRE Vs NZ 1st ODI: భళా బ్రేస్‌వెల్‌.. ఐర్లాండ్‌పై కివీస్‌ విజయం

Published Mon, Jul 11 2022 6:41 AM | Last Updated on Mon, Jul 11 2022 11:02 AM

Ireland vs New Zealand 1st ODI: New Zealand beat Ireland by one wicket  - Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ ఒక వికెట్‌తో గెలిచింది. మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (82 బంతుల్లో 127 నాటౌ ట్‌; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకంతో న్యూజిలాండ్‌ను గెలిపించాడు.

చివరి ఓవర్లో కివీస్‌ విజయానికి 20 పరుగులు అవసరంకాగా... ఐర్లాండ్‌ బౌలర్‌ యంగ్‌ వేసిన ఈ ఓవర్‌లో బ్రేస్‌వెల్‌ వరుసగా 4, 4, 6, 4, 6 బాది మరో బంతి మిగిలి ఉండగానే కివీస్‌ విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 300 పరుగులు చేసింది. టెక్టర్‌ (113; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 305 పరుగులు చేసి నెగ్గింది.

చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement