విండీస్, జింబాబ్వే వన్డే ‘టై’
విండీస్, జింబాబ్వే వన్డే ‘టై’
Published Sun, Nov 20 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
బులవాయో: జింబాబ్వే పేసర్ డొనాల్డ్ తిరిపానో సంచలన ఓవర్‌తో తమ జట్టును ఓటమి నుంచి రక్షించాడు. చేతిలో ఐదు వికెట్లతో వెస్టిండీస్ చివరి ఓవర్లో విజయానికి 4 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా... తిరిపానో 3 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్‌లో పరుగులు తీయలేక మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌటయ్యారు.
ఫలితంగా శనివారం ఇక్కడ జరిగిన ముక్కోణపు టోర్నీ వన్డే మ్యాచ్ ‘టై’గా ముగిసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. క్రెరుుగ్ ఇర్విన్ (100 బంతుల్లో 92; 6 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా, సికందర్ రజా (81 బంతుల్లో 77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
కార్లోస్ బ్రాత్‌వైట్‌కు 4 వికెట్లు దక్కారుు. అనంతరం విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 257 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్ (120 బంతుల్లో 101; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, క్రెరుుగ్ బ్రాత్‌వైట్ (117 బంతుల్లో 78; 2 ఫోర్లు) అండగా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో తిరిపానో, సీన్ విలియమ్స్ చెరో 2 వికెట్లు తీశారు. ఇది అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ‘టై’ అరుున 34వ మ్యాచ్ కావడం విశేషం.
Advertisement