దక్షిణాఫ్రికా ఘన విజయం
బెనోని: ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన ఏకై క వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 206 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న తెంబా బవుమా (123 బంతుల్లో 113; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... డి కాక్ (82), డుమిని (52 నాటౌట్), బెహర్దీన్ (50) రాణించారు. క్రెయిగ్ యంగ్‌కు 3 వికెట్లు దక్కాయి.
అనంతరం ఐర్లాండ్ 30.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. కెవిన్ ఓబ్రైన్ (41), పాల్ స్టిర్లింగ్ (40) పర్వాలేదనిపించారు. డుమిని (4/16) ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 12వ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన బవుమాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మంగళవారం ఇదే మైదానంలో జరిగే ఏకై క వన్డేలో ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో తలపడుతుంది.