ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (76 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీతో కథం తొక్కగా.. శిఖర్ ధావన్ 31 పరుగులు చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకొని 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
రోహిత్ శర్మ అర్థశతకం.. విజయం దిశగా టీమిండియా
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ అర్థశతకంతో మెరిశాడు. తద్వారా మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చేరువగా వచ్చింది. ప్రస్తుతం 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. రోహిత్ 67, ధావన్ 27 పరుగులతో ఆడుతున్నారు.
నిలకడగా ఆడుతున్న టీమిండియా
►111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 3, శిఖర్ ధావన్ 15 పరుగులతో ఆడుతున్నారు.
►3 ఓవర్లలో టీమిండియా 8 పరుగులు చేసింది. రోహిత్ 7, ధావన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
బుమ్రా కెరీర్ అత్యుత్తమ గణాంకాలు.. ఇంగ్లండ్ 110 ఆలౌట్
►టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 110 పరుగులకే కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు(7.2-3-19-6) నమోదు చేయగా.. షమీ 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జాస్ బట్లర్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టీమిండియా బౌలర్ల దాటికి నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. చివర్లో డేవిడ్ విల్లీ 21 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ వంద పరుగులను దాటగలిగింది.
ఐదేసిన బుమ్రా.. ఇంగ్లండ్ 103/9
►టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఎనిమిదో వికెట్ డౌన్.. ఇంగ్లండ్ స్కోరు 68/8
►క్రెయిగ్ ఓవర్టన్ రూపంలో ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన ఇన్‌స్వింగర్‌కు ఓవర్టన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఢిపెన్స్ ఆడే ప్రయత్నంలో ఓవర్టన్ విఫలం కాగా.. బంతి నేరుగా మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో ఇంగ్లండ్ వంద పరుగులు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. డేవిడ్ విల్లే 5, బ్రైడన్ కార్స్ క్రీజులో ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
►ఇంగ్లండ్ ఆటతీరు దారుణంగా ఉంది. పరుగులు చేయడానికి బ్యాటర్లు నానాపాట్లు పడుతున్నారు. తాజాగా కెప్టెన్ జాస్ బట్లర్(30) షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఆడుతుంది. క్రీజులో డేవిడ్ విల్లే, క్రెయిగ్ ఓవర్టన్ ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
►మొయిన్ అలీ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన మొయిన్ అలీ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. బట్లర్ 24 పరుగులుతో ఆడుతున్నాడు.
చెలరేగిన బుమ్రా.. 30 పరుగులకే ఐదు వికెట్లు
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్ కనబరుస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. వీరిద్దరి దాటికి నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. ప్రస్తుతం బట్లర్ 14, మొయిన్ అలీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
►ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య మొదటి వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి గాయంతో దూరమయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో పంజా విసురుతున్న భారత్ ఇప్పుడు వన్డేలపై కన్నేసింది.
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
► ఈ సిరీస్‌ను కూడా టి20 తరహా దూకుడుతో చేజిక్కించుకోవాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు టి20 చివరి మ్యాచ్‌లో నెగ్గిన ఊపులో ఉన్న ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment