Ind vs Eng 3rd ODI: వరుణ్‌ చక్రవర్తికి గాయం.. ఆ ఇద్దరికి విశ్రాంతి | Ind vs Eng 3rd ODI Ahmedabad: Toss, Playing XI of Both Teams | Sakshi

Ind vs Eng 3rd ODI: టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. భారత తుదిజట్టులో మూడు మార్పులు

Feb 12 2025 1:06 PM | Updated on Feb 12 2025 2:40 PM

Ind vs Eng 3rd ODI Ahmedabad: Toss, Playing XI of Both Teams

Ind vs Eng 3rd ODI: టీమిండియాతో అహ్మదాబాద్‌ వన్డేలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తన నిర్ణయం గురించి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(Jos Buttler) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము ముందుగా బౌలింగ్‌ చేయాలని అనుకుంటున్నాం. మ్యాచ్‌ సాగే కొద్దీ పిచ్‌ పరిస్థితి మెరుగుపడవచ్చు. తొలి రెండు వన్డేల్లో మేము ముందుగా బ్యాటింగ్‌ చేశాం. 

అందుకే చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాం. వికెట్‌ బాగుంది. ఇక్కడే మేము న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడాం. నల్లరేగడి మట్టి పిచ్‌ సెకండాఫ్‌లో బ్యాటింగ్‌కు ఇంకాస్త అనుకూలంగా మారుతుంది. ఈరోజు మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేమీ ఓవర్టన్‌ స్థానంలో టామ్‌ బాంటన్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

మరోవైపు.. టాస్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ(Rohit Sharma) తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడుతున్నట్లు వెల్లడించాడు. రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీలకు విశ్రాంతినిచ్చామన్న రోహిత్‌.. దురదృష్టవశాత్తూ వరుణ్‌ చక్రవర్తి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని తెలిపాడు. 

వరుణ్‌ పిక్కల్లో నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌ తుదిజట్టులోకి వచ్చినట్లు రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్‌ సేన చేతిలో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో 4-1తో ఓడిపోయిన బట్లర్‌ బృందం.. వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. నాగ్‌పూర్‌, కటక్‌ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్‌ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 2-0తో ఓటమిపాలైంది.

తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ముందు ఒక్క వన్డేలో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే పనిలో ఉంది. మరోవైపు.. క్లీన్‌స్వీప్‌ విజయంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

తుదిజట్లు
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లండ్‌
ఫిలిప్ సాల్ట్(వికెట్‌ కీపర్‌), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్‌ మహమూద్.

చదవండి: 119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్‌ ఘనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement