
గెటింగ్ ఎంగేజ్‌డ్!
ఒకరినొకరు క్షణం కూడా విడిచి ఉండలేనంతగా కలసి తిరుగుతున్నారు క్రికెటర్ విరాట్ కోహ్లి, హిందీ భామ అనుష్కశర్మ. మొన్న శ్రీలంకతో వన్డే మ్యాచ్‌కు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి వాలిపోయిందీ భామ. అందుకు తగ్గట్టుగానే కొహ్లీ కూడా... ఆరువేల పరుగుల మైలు రాయిని అందుకోగానే పిచ్‌పై నుంచే తన ఫియాన్స్‌కు కిస్సులు కురిపించాడు. ఈ బంధం మరో అడుగు ముందుకు వేయనుందనేది తాజా సమాచారం. ఇరువురి పెద్దలు ఓ నిర్ణయానికి కూడా వచ్చారనేది మిడ్ డే డాట్ కామ్ కథనం.