
డేటింగ్‌లో ‘టచ్’!
బ్యాటింగ్‌లో ‘టచ్’ కోల్పోయినా ‘డేటింగ్’లో మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు విరాట్ కొహ్లీ. లేదు లేదంటూనే ప్రియురాలు అనుష్కాశర్మతో రెగ్యులర్ ‘టచ్’లో ఉన్నాడనేది ఓ పత్రిక కథనం. ఇంగ్లండ్ టూర్‌కు అమ్మడిని వెంటేసుకెళ్లి... ఆటలో అండర్ పెర్‌ఫార్మ్స్ చేసిన ఈ యూపీ కుర్రాడిపై మీడియాతో పాటు అభిమానులూ కస్సుమన్నారు. అయినా మనోడు షరా మామూలే. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నారన్న వార్తలు వస్తున్నా అటు విరాట్ గానీ, ఇటు అనుష్క గానీ ధ్రువీకరించడంలేదు.