విశాఖ స్పోర్ట్స్: విశాఖ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో పర్యటించనున్న ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడేందుకు రానుంది. ఆ్రస్టేలియా జట్టు ఈ సిరీస్‌లో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లాడనుండగా.. రెండో వన్డే మార్చి19న వైఎస్సార్ స్టేడియం వేదికగా జరగనుంది. 17న తొలి వన్డే ముంబయిలో, 22న మూడో వన్డే చెన్నై వేదికగా బీసీసీఐ ఖరారు చేసింది.
ఇక 12 ఏళ్ల విరామం అనంతరం మరోసారి ఆస్ట్రేలియా జట్టు విశాఖ క్రీడాభిమానులను అలరించనుంది. 2010 అక్టోబర్ 10న కంగారు జట్టు భారత్‌తో ఆడింది. అప్పట్లోనూ సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలోనే ఇరు జట్లు ఇక్కడ తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ ఏడు బంతులుండగా విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌తో భారత్ సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించింది. విరాట్‌కోహ్లీ విశ్వరూపం చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్ తరఫున శిఖర్‌ధావన్ ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment