టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. కోహ్లి కెరీర్‌లో ఇది 28వ శతకం. డబుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగిన కోహ్లి తన ఇన్నింగ్స్‌తో టీమిండియా 571 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం వచ్చేలా చేశాడు.
అయితే ఈ టెస్టు సెంచరీకి ముందు కోహ్లిపై మరోసారి విమర్శలు వచ్చాయి. వన్డేలు, టి20ల్లో మాత్రమే కోహ్లిని ఆడించండి.. టెస్టులకు పక్కనబెట్టండి.. అంటూ పేర్కొన్నారు. కానీ కోహ్లి ఎన్నడూ వారి మాటలను పట్టించుకోలేదు. కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో వరుసగా శతకాలతో రెచ్చిపోయాడు. కానీ ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం కోహ్లి ఆకట్టుకోలేదంటూ వార్తలు రాశారు.
కానీ ఇక్కడ మాట్లాడాల్సింది కోహ్లి ఆటపై కాదు.. పిచ్ తీరు గురించి. ఎందుకంటే తొలి మూడు టెస్టుల్లో కోహ్లియే కాదు ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుంటూ బ్యాటర్లు ఎలా పరుగులు చేయగలరు. పైగా మూడు టెస్టులో ఒకేరీతిలో రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. మరి ఇలా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగుస్తుంటే కోహ్లి మాత్రం ఎలా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సరైన బ్యాటింగ్ పిచ్ కోసం కోహ్లి ఎదురుచూశాడు.
ఆ ఎదురుచూపులు మలి టెస్టులోనే ఫలించాయి. అహ్మదాబాద్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై కోహ్లి తన పవరేంటో చూపించాడు. ఒక్క సెంచరీతో చాలా మంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు తీసుకుంటూ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''ఈ ఒక్క సెంచరీతో నేనేం గాల్లో తేలడం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు.. కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదు. విఫలమయ్యానన్న ప్రతీసారి నిలదొక్కుకుంటూ వస్తున్నా. ఎవరికి తగలాలో వాళ్లకి గట్టిగానే తగిలింది. నేను ఎందుకు ఫీల్డ్‌లో కొనసాగుతున్నానో చూపించాలనుకున్నా.. చూపించా. ఇక ఆట ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను.
నా డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. నాగ్‌పూర్ టెస్టు నుంచి బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినప్పటికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించిన తొలి మూడు టెస్టుల్లో బ్యాటింగ్‌లో రాణించేందుకు గతంలోలాగే నా శాయాశక్తులా ప్రయత్నించా. కానీ బ్యాటింగ్ సరిగా చేయకపోవడంతో కొంత నిరాశకు గురయ్యా'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment