
బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన డు ప్లెసిస్!
దుబాయ్: దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆరోపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మంగళవారం నాలుగో రోజు ఆటలో తన లాలాజలం, బబుల్‌గమ్‌తో బంతిని మరింత మెరిసేలా చేస్తున్నట్టు వీడియో ఫుటేజిలో కనిపించింది.
ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2.9ను అతిక్రమించినట్టేనని ఐసీసీ స్పష్టం చేసింది. డు ప్లెసిస్ దోషిగా తేలితే అతనిపై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశముంటుంది.