
డు ప్లెసిస్ అప్పీలు తిరస్కరణ
బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై జరిమానా విధించినందుకు అప్పీలుకు వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్‌కు నిరాశే ఎదురైంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి కమిషన్ చైర్మన్ మైకేల్ బిలాఫ్ అతని అప్పీలును తోసిపుచ్చారు.
హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా బంతి ఆకారాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు (ట్యాంపరింగ్) వీడియోల్లో తేలడంతో అప్పటి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. దీనిని ఐసీసీ కమిషన్‌కు డు ప్లెసిస్ అప్పీలు చేసుకోగా...దానిని తిరస్కరించారు.