వార్నర్ క్యాచ్ పట్టిన డుప్లెసిస్(ఫోటో కర్టసీ; ట్విట్టర్)
దుబాయ్: ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే ఆటగాడు డుప్లెసిస్ మాయచేస్తున్నాడు. అరే ఇది సిక్స్ అనుకునేలోపే దాన్ని బౌండరీ లైన్‌పై ఎగిరేసి అమాంత క్యాచ్ పట్టేసి ఔరా అనిపిస్తున్నాడు. క్యాచ్ పట్టే క్రమంలో నియంత్రణ చేసుకోవడానికి బౌండరీ లైన్ దాటేసినా బంతిపై ఏకాగ్రత మాత్రం కోల్పోవడం లేదు. బంతిని అలా బౌండరీ లైన్ బయటకు గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి క్యాచ్‌లను అందుకునే తీరు శభాష్ అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో సౌరవ్ తివారీ, హార్దిక్ పాండ్యాలను ఇలాగే మింగేసిన డుప్లెసిస్.. తాజాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కీలకమైన డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టేసుకున్నాడు.
సీఎస్‌కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన 11వ ఓవర్ ఐదో బంతికి వార్నర్ భారీ షాట్ కొట్టాడు. ఇది సిక్స్ అనుకున్నారంతా. కానీ అక్కడ డుప్లెసిస్ ఉన్నాడు. అంతే అమాంతం గాల్లోకి ఎగిరి ముందు క్యాచ్ అందుకున్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్‌ను దాటేస్తూ బంతిని బయటకు విసిరాడు. మళ్లీ వచ్చీ తీరిగ్గా క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు పట్టడానికి అంతా ఆపసోపాలు పడుతూ ఉంటే డుప్లెసిస్ మాత్రం ఇట్టే వాటిని అందుకుంటున్నాడు. బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు పట్టడం ఇంత ఈజీని అని అనుకునేలా మైమరిస్తున్నాడు.వార్నర్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ 69 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై అదే స్కోరు విలియమ్సన్(9)ని అంబటి రాయుడు రనౌట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది.
Comments
Please login to add a commentAdd a comment