దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సామ్ కరాన్(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్ వాట్సన్(42; 38 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు(41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డుప్లెసిస్ ఆడిన తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌తో కలిసి సామ్ కరాన్ ఆరంభించాడు. అయితే డుప్లెసిస్ గోల్డెన్ డక్ కావడంతో వాట్సన్ ఫస్ట్ డౌన్ వచ్చాడు. కరాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
కాగా, సీఎస్‌కే స్కోరు 35 పరుగుల వద్ద కరాన్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వాట్సన్-అంబటి రాయుడులు ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. భారీ షాట్లతో అలరించాడు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత రాయుడు భారీ షాట్ ఆడబోయి వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఫుల్‌టాస్ బాల్‌కు రాయుడు వికెట్ సమర్పించుకున్నాడు. కాసేపటికి వాట్సన్ కూడా అదే తరహాలో పెవిలియన్ చేరాడు. నటరాజన్ వేసిన ఫుల్‌టాస్ బంతికి షాట్ ఆడబోయిన వాట్సన్..మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో ధోని(21; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), జడేజా(25 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్)లు ఆకట్టుకోవడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ ,ఖలీల్ అహ్మద్, నటరాజన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.
డుప్లెసిస్ తడ‘బ్యాటు’
సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్-సామ్ కరాన్‌లు ఆరంభించారు. షేన్ వాట్సన్‌కు బదులు సామ్ కరాన్ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి డుప్లెసిస్ ఔటయ్యాడు. కేవలం బంతి మాత్రమే ఆడి గోల్డెన్ డక్ అయ్యాడు. బంతిని అంచనా వేయడంలో కాస్త తడబడ్డ డుప్లెసిస్ డిఫెన్స్ ఆడబోయి వికెట్ కీపర్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సందీప్ శర్మ వేసిన ఆ బంతి అవుట్ సైడ్ ఆఫ్‌స్టంప్ పడి కొద్దిగా స్వింగ్ అయ్యింది. దాంతో బ్యాట్‌ను పెట్టాలా.. వద్దా అనే తడబాటులో వికెట్‌ను సమర్పించుకున్నాడు. అక్కడ డుప్లెసిస్‌ను ‘డబుల్ మైండ్’కు గురిచేసిన సందీప్ శర్మ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 10 పరుగుల వద్దే వికెట్‌ను కోల్పోయింది.
పించ్ హిట్టర్‌గా సామ్ కరాన్
వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్న సీఎస్‌కే..ఈ మ్యాచ్‌లో సామ్ కరాన్‌ను ఓపెనర్‌గా పంపింది. డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కరాన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టి సీఎస్‌కేకు విలువైన పరుగులు సాధించిపెట్టాడు. తనను పించ్ హిట్టర్‌గా పంపిన రోల్‌కు న్యాయం చేశాడు. డుప్లెసిస్ వికెట్‌ను ఆరంభంలో కోల్పోయినా కరాన్ బ్యాట్ నుంచి కొన్ని భారీ షాట్లు రావడంతో సీఎస్‌కే శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. తర్వాత వాట్సన్ మెరవడం, అంబటి రాయుడు నుంచి మరో మంచి ఇన్నింగ్స్ రావడంతో సీఎస్‌కేకు కాస్త బెంగ తీరింది. చివర్లో ధోని-జడేజాలు కూడా మెరుపులు మెరిపించడంతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment