ఎంఎస్ ధోని (కర్టసీ ఐపీఎల్/ బీసీసీఐ)
దుబాయ్ : ఎంఎస్ ధోని తన ఆటతీరుతో ఎంతో మంది యువఆటగాళ్లకు దిశానిర్ధేశం చేశాడు. ధోనిని అభిమానించే వారిలో ఇప్పటి యంగ్‌స్టర్ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఐపీఎల్‌లో 8జట్లు ఉండగా.. ఆ జట్టులో దేశం నుంచి ఎందరో యంగ్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ధోని ఆటను చూస్తూ పెరిగిన వీరు ఇప్పుడు ధోనితో కలిసి ఆడే అవకాశం(ప్రత్యర్థి జట్లు) వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లు ధోనిని కలిసి తమ ఆటను మెరుగుపరుచుకునేందుకు సలహాలు, సూచనలు వినేవారు. (చదవండి : 'ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు')
తాజాగా మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లైన ప్రియమ్ గార్గ్, షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలతో మాట్లాడుతూ కెమెరా కంటికి చిక్కాడు. వారితో ధోని ఏం మాట్లాడాడనేది స్పష్టం లేకపోయినా.. యువ ఆటగాళ్లకు ధోని ఇస్తున్న సూచనల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో ఉన్నంతవరకే ధోని సీరియస్‌గా ఉంటాడు. ఆ సందర్భంలోనే తప్పుఒప్పులు చేస్తుంటాడు. ఒక్కసారి మ్యాచ్ ముగిసిందంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లైన సరే వారి ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఇలాంటివి ధోనికి మాత్రమే సాధ్యం. ఐపీఎల్ తన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ధోని వారికి తన అనుభవాలతో పాటు ఆటలో నైపుణ్యం పెంచేందుకు మెళుకువలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. (చదవండి :ధోనిపై అభిమానంతో ఇంటిని మార్చేశాడు)
Thala @msdhoni is intense on the field but off it, he always shares his knowledge and wisdom with the younger bunch.
— IndianPremierLeague (@IPL) October 13, 2020
😍 #Dream11IPL #SRHvCSK pic.twitter.com/9TJTw7WLNx
కానీ ఇదే ధోని ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇన్నింగ్స్ 19వ ఓవర్ అంపైర్ రీఫెల్ నిర్ణయం క్రీడా విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఆ ఓవర్‌లో శార్దుల్ వేసిన రెండో బంతి క్రీజ్‌కు చాలా దూరంగా వెళ్లింది. దీనిని వైడ్‌గా ప్రకటించేందుకు కొంత వరకు అంపైర్ పాల్ రీఫెల్ చేతులు కూడా ఎత్తేశాడు. అయితే అటు ధోని, ఇటు శార్దుల్ తమ అసహనాన్ని ప్రదర్శించడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఎలా చూసినా అది స్పష్టంగా ‘వైడ్’ అని తెలిసిపోతోంది. టీవీ రీప్లేలో కూడా అది స్పష్టంగా కనిపించింది. అయితే 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్ రీఫెల్ ఆటగాళ్ల ఒత్తిడితో ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. రైజర్స్ కెప్టెన్ వార్నర్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కనిపించింది. సన్‌రైజర్స్ అభిమానులు రీఫెల్‌కు అంపైరింగ్ నేర్పించాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అంపైర్ ధోనికి భయపడి నిర్ణయాన్ని మార్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. (చదవండి : కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్)
Comments
Please login to add a commentAdd a comment