టీమిండియానే ఫేవరెట్.. కానీ | India favourites, but World T20 an 'open' tournament, says Du Plessis | Sakshi
Sakshi News home page

టీమిండియానే ఫేవరెట్.. కానీ

Published Fri, Mar 11 2016 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

టీమిండియానే ఫేవరెట్.. కానీ

టీమిండియానే ఫేవరెట్.. కానీ

ముంబై: వరల్డ్ టీ 20లో భారత క్రికెట్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ స్సష్టం చేశాడు. ఇటీవల కాలంలో ఈ పొట్టి ఫార్మాట్ గేమ్లో టీమిండియా నిలకడగా రాణిస్తూ అనేక విజయాలను సొంతం చేసుకుందన్నాడు. అయితే ఇది ఓపెన్ టోర్నమెంట్ అయినందున మిగతా జట్ల అవకాశాలను కూడా తీసిపారేయలేమని పేర్కొన్నాడు.

 

'స్వదేశీ పరిస్థితుల నేపథ్యంలో ధోని అండ్ గ్యాంగే వరల్డ్ టీ 20లో ఫేవరెట్. కానీ ఓపెన్ టోర్నమెంట్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. తనదైన రోజున ఏ జట్టైనా అద్భుతాలను సృష్టించవచ్చు. నా దృష్టిలో ఈ వరల్డ్ కప్లో అంచనాలు కూడా తారుమారు కావొచ్చు. మేము వరల్డ్ కప్ ను గెలిస్తే మా జట్టుపై ఉన్న విఫల ముద్ర తొలిగిపోతుంది. 'అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. శనివారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనున్ననేపథ్యంలో డు ప్లెసిస్ మీడియాతో ముచ్చటిస్తూ పై విధంగా స్పందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement