'ఆ స్ట్రోక్ ఆసీస్కు గుర్తుండిపోతుంది' | Australia will be scarred after ODI whitewash: Faf du Plessis | Sakshi
Sakshi News home page

'ఆ స్ట్రోక్ ఆసీస్కు గుర్తుండిపోతుంది'

Published Tue, Oct 18 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

'ఆ స్ట్రోక్ ఆసీస్కు గుర్తుండిపోతుంది'

'ఆ స్ట్రోక్ ఆసీస్కు గుర్తుండిపోతుంది'

కేప్ టౌన్:ఇటీవల తమతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసి ఆ జట్టుకు మరచిపోలేని స్ట్రోక్ ఇచ్చామంటున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్. ఆసీస్ కు ఆ సిరీస్  చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన సిరీస్లో ఆసీస్ అలా ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా బలహీనపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

'మాతో టెస్టు సిరీస్కు వారు డిఫరెంట్ జట్టుతో వస్తారు. వన్డేల్లో కంటే మంచి జట్టుతోనే ఆసీస్ టెస్టు సిరీస్ కు సిద్ధమవుతుంది. టెస్టు సిరీస్ లో మంచి ఆరంభాన్ని దక్కించుకోవాలంటే నాణ్యమైన జట్టు అనేది ముఖ్యం. మాతో జరిగిన వన్డే సిరీస్ వారికి మరచిపోలేని అనుభవం. అది ఆసీస్ కు ఎదురైన చిన్న దెబ్బ కాదు.. ఆ జట్టును మానసికంగా బలహీనపరిచే స్ట్రోక్' అని డు ప్లెసిస్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement