
డు ప్లెసిస్, చండీమాల్‌లపై మ్యాచ్ నిషేధం
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లకు కీలక దశలో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్, శ్రీలంక సారథి దినేశ్ చండీమాల్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక టి20 మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో ఈ రెండు జట్ల తదుపరి మ్యాచ్‌లకు డుప్లెసిస్, చండీమాల్‌లు డగౌట్‌కే పరిమితం కానున్నారు. ఈ నెల 27న చిట్టగాంగ్‌లో జరిగిన గ్రూప్-1 లీగ్ మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌పై శ్రీలంక స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది.
దీంతో ఐసీసీ రిఫరీ డేవిడ్ బూన్ ఇద్దరు కెప్టెన్లపై ఒక టి20 నిషేధం, మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా జట్టు 12 నెలల కాలంలో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఆర్టికల్ 2.5.1 ఐసీసీ క్రమశిక్షణ నియమావళి కింద ఆ టీమ్ కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. డు ప్లెసిస్, చండీమాల్‌లపై సస్పెన్షన్ కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఆడే తదుపరి మ్యాచ్‌లకు డివిలియర్స్(29న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు), మలింగ(31న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.