ఆస్ట్రేలియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు | Mitchell Marsh set to join Australia squad in Mumbai on Sunday evening | Sakshi
Sakshi News home page

World Cup 2023: ఆస్ట్రేలియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు

Published Sat, Nov 4 2023 9:57 PM | Last Updated on Sun, Nov 5 2023 11:28 AM

Mitchell Marsh set to join Australia squad in Mumbai on Sunday evening - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నవంబర్‌ 7న వాంఖడే వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్‌ అందింది. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరనున్నాడు.

తన తాత మరణంతో పెర్త్‌కు వెళ్లిన మార్ష్‌.. ఆదివారం(నవంబర్‌ 5) జట్టుతో కలవనున్నాడు. కాగా మిచిల్‌ మార్ష్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.  ఈ టోర్నీలో ఇప్పటికే తన పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్‌ 121 పరుగులు చేశాడు.

ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌.. 225 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ‍ఆసీస్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్‌ కలిగి ఉంది. 
చదవండిWC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement