
PC: INSide Sport
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా.. టీమిండియాతో తొలి వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ దూరమయ్యే అవకాశం ఉంది. కాగా ఆక్టోబర్ 12న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో డేవిడ్ వార్నర్ మెడకు గాయమైంది.
దీంతో అతడు ఫీల్డ్‌ను వదిలివెళ్లాడు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా వార్నర్‌ను ఇంగ్లండ్‌తో అఖరి టీ20కు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా భారత్‌తో వార్మప్ మ్యాచ్‌లో కూడా డేవిడ్ భాయ్‌ను ఆడించి రిస్క్ తీసుకోడదని ఆసీస్ మేనేజెమెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గాయం నుంచి కోలుకుని ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన స్టోయినిష్, మార్ష్‌కు కూడా వార్మప్ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో స్టోయినిష్, వార్నర్, మార్ష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. స్టోయినిష్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్22న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
చదవండి: రోహిత్ శర్మ సింప్లిసిటీ.. సాధారణ వ్యక్తిలా క్యాబ్‌లో..!