
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తన గాయం నుంచి కోలుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా వైద్యబృందం నుంచి మార్ష్ క్లియరెన్స్ పొందాడు. 33 ఏళ్ల మార్ష్ వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు దూరమయ్యాడు.
ఈ క్రమంలో నెల రోజుల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపిన మార్ష్ తిరిగి తన ఫిట్‌నెస్‌ను పొందాడు. అయితే మార్ష్ ఈ ఏడాది సీజన్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచనల మేరకు కొన్నాళ్లపాటు మార్ష్ బౌలింగ్‌కు దూరంగా ఉండనున్నాడు.
బౌలింగ్ చేసే క్రమంలో వెన్నెముకపై ఎక్కువగా ఒత్తిడి పడే అవకాశమున్నందన బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యలు సూచించినట్లు ఈఎస్పీఎన్ తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అతడిని లక్నో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయెగించుకునే అవకాశముంది.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో మార్ష్‌ను రూ.3.3 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. త్వరలోనే లక్నో జట్టుతో మార్ష్ కలవనున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిల్లర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో మార్ష్ ఆడనున్నాడు. గత రెండు సీజన్లలో మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మెగా వేలానికి ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది.
ఇక ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఇక మార్ష్‌తో పాటు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సైతం పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. త్వరలోనే ఈ ఆసీస్ ఆటగాళ్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో కలవనున్నారు.
ఐపీఎల్-2025కు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్:
డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్‌రమ్, హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్.
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment