T20 World Cup 2021: Shane Warne Says "They Can Win The World Cup" - Sakshi
Sakshi News home page

Shane Warne: ట్రోఫీ గెలవగల సత్తా ఉంది.. ఆ జట్టే ప్రపంచకప్‌ విజేత!

Published Tue, Nov 9 2021 2:41 PM | Last Updated on Tue, Nov 9 2021 5:23 PM

T20 World Cup 2021: Shane Warne Says They Can Win The World Cup - Sakshi

T20 World Cup 2021: They can win the WC - Shane Warne: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2021 తుది దశకు చేరుకుంటోంది. నవంబరు 14న ఈ మెగా టోర్నీ విజేత ఎవరో తేలనుంది. ఇప్పటికే సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టైటిల్‌ గెలిచే క్రమంలో హోరాహోరీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ వరల్డ్‌కప్‌ విన్నర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆరోన్‌ ఫించ్‌ సారథ్యంలోని ఆసీస్‌కు ట్రోఫీ గెలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇంతవరకు నిలకడైన ప్రదర్శన కనబరిచిన అత్యుత్తమ జట్టుకు టైటిల్ అందుకునే అర్హత ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగుందని.. అందరూ ఫామ్‌లో ఉండటం శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ నిలకడగా ఆడుతూ.. మార్ష్‌, స్టొయినిస్‌, మాక్స్‌వెల్‌ మెరుగ్గా రాణిస్తే తిరుగే ఉండదని వార్న్‌ అభిప్రాయపడ్డాడు. 

పూర్తి విశ్వాసంతో ఉన్నాం
గ్రూపు-1లో ఉన్న ఆస్ట్రేలియా... ఐదింట నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లండ్‌తో పాటు సె​మీస్‌కు దూసుకెళ్లింది. ఇక గ్రూపు-2 టాపర్ అయిన పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ అమీతుమీ తేల్చుకోనుంది. నవంబరు 11 దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌ జరుగనుంది. అయితే, ఈ మైదానంలో టాస్‌ గెలిచిన జట్టుకే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాల నేపథ్యంలో మిచెల్‌ మార్ష్‌ మాట్లాడుతూ.. ‘‘టాస్‌ అంతగా ప్రభావం చూపుతుందని నేను అనుకోను.

అయితే, ఇక్కడ టాష్‌ గెలిచిన దాదాపు అన్ని జట్లు తొలుత బౌలింగ్‌ చేసేందుకే మొగ్గుచూపాయి. కానీ.. గత రెండు మ్యాచ్‌లలో మంచు అంతగా లేనట్లు అనిపించింది. నిజానికి తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు కచ్చితంగా భారీ స్కోరు నమోదు చేయగలగాలి. అదే విధంగా స్కోరును కాపాడుకోగలగాలి. మేము ఇప్పుడు సెమీ ఫైనల్‌లో ఉన్నాం. పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఏం జరుగుతుందో ఊహించడం కష్టం’’ అని పేర్కొన్నాడు. కాగా ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఇంతవరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్‌కప్‌ గెలవలేదన్న సంగతి తెలిసిందే.

చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్‌ యూ భాయ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement