Photo Courtesy: IPL
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కీలక సమరానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త అందింది. వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పాక్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన మార్ష్.. తాజాగా నెట్స్‌లో హుషారుగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డీసీ యాజమాన్యం ట్విటర్‌లో షేర్ చేసింది.
— Delhi Capitals (@DelhiCapitals) April 15, 2022
కాగా, వాంఖడే వేదికగా ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. విండీస్ ఆల్‌రౌండర్ రోవమన్ పావెల్ స్థానంలో మార్ష్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మార్ష్ చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ మరింత బలపడనుంది. ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్ష్‌ను రూ.6.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌లో డీసీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, మరో రెండిటిలో ఓటమిపాలైంది. ప్రస్తుతానికి ఆ జట్టు 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 2 అపజయాలతో ఢిల్లీ కంటే ఓ ప్లేస్ ముందుంది. ఆర్సీబీ 6 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (అంచనా): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్
చదవండి: దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment