Delhi Capitals Player Mitchell Marsh Likely to Miss IPL 2022 Says Reports - Sakshi
Sakshi News home page

IPL2022: విజయానందంలో ఉన్న పంత్‌ సేనకు సాడ్‌ న్యూస్‌

Published Mon, Mar 28 2022 3:48 PM | Last Updated on Mon, Mar 28 2022 9:42 PM

Delhi Capitals Player Mitchell Marsh Likely To Miss IPL 2022 Says Reports - Sakshi

Mitchell Marsh Likely To Miss IPL 2022: ముంబై ఇండియన్స్‌పై సూపర్‌ విక్టరీ సాధించి సంబురాల్లో మునిగితేలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ సాడ్‌ న్యూస్‌ తెలిసింది. ప్రస్తుతం పాక్‌ పర్యటనలో ఉన్న ఆ జట్టు కీలక ఆటగాడు, స్టార్‌ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు గాయమైనట్లు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారధి ఆరోన్‌ ఫించ్‌ వెల్లడించాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మార్ష్‌కు తొడ కండరాలు పట్టేసాయని ఫించ్‌ పేర్కొన్నాడు. దీంతో మార్ష్‌ పాక్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని ఫించ్‌ తెలిపాడు. 

ఒకవేళ మార్ష్‌కు తగిలిన గాయం పెద్దదైతే అతను ఐపీఎల్ 2022 ఆడేది కూడా అనుమానమేనని తెలుస్తోంది. ఈ వార్త తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉలిక్కిపడింది. ఇటీవలే ముగిసిన వేలంలో మార్ష్‌ను డీసీ 6.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇప్పటికే కీలక బౌలర్, సౌతాఫ్రికా ఆటగాడు ఆన్రిచ్ నోర్జే సేవలను కోల్పోయిన డీసీకి.. ఆల్‌రౌండర్ మార్ష్ కూడా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, పంత్‌ సేన తమ తదుపరి మ్యాచ్‌లో (ఏప్రిల్‌ 2న) గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. 
చదవండి: పంజాబ్‌ విజయంపై 'ఆ సినిమా' ప్రభావం.. అదే స్పూర్తితో..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement