ఐపీఎల్ కు మిచెల్ మార్ష్ దూరం! | Mitchell Marsh Set To Miss IPL Yet Again, Faces Lengthy Absence | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ కు మిచెల్ మార్ష్ దూరం!

Published Tue, Mar 14 2017 1:33 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

ఐపీఎల్ కు మిచెల్ మార్ష్ దూరం!

ఐపీఎల్ కు మిచెల్ మార్ష్ దూరం!

మెల్బోర్న్: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.  ఇటీవల భుజం గాయం కారణంగా భారత పర్యటన నుంచి మిచెల్ మార్ష్ అర్థాంతరంగా వైదొలిగాడు. మరొకవైపు అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సుదీర్ఘ విశ్రాంతి అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలో మిచెల్ మార్ష్ భుజానికి శస్త్రచికిత్స  అనివార్యమయ్యే అవకాశం ఉండటంతో అతను ఐపీఎల్-10వ సీజన్ లో ఆడటం దాదాపు లేనట్లే.

 

ఒకవేళ మిచెల్ శస్త్రచికిత్స అనివార్యమైతే మాత్రం అతను తొమ్మిదినెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని ఆసీస్ క్రికెట్ వర్గాల సమాచారం. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిచెల్ మార్ష్..గతేడాది కూడా భుజం గాయం కారణంగానే  ఐపీఎల్ నుంచి మధ్యలో వైదొలిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement