
మిచెల్ కు తొమ్మిది నెలల విశ్రాంతి!
సిడ్నీ: భారత్ తో టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. ఈ ఏడాది యాషెస్ సిరీస్ లో పాల్గొనే అవకాశాలు కనబడటం లేదు. మార్ష్ భుజానికి శస్త్ర చికిత్స అనివార్యం కావడంతో అతను దాదాపు తొమ్మిది నెలలు పాటు ఇంటికే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో యాషెస్ కు మిచెల్ మార్ష్ దూరమయ్యే అవకాశం ఉంది.
ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్ లో భుజం గాయంతో బాధపడిన మార్ష్.. భారత్ పర్యటనలో కూడా అదే గాయంతో సతమతమయ్యాడు. అయితే రెండో టెస్టులో ఆ గాయం మరింత బాధించడంతో మిగిలిన రెండు టెస్టులకు మిచెల్ మార్ష్ దూరం కాకతప్పలేదు.