
మిచెల్ మార్ష్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున స్టార్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో మిచెల్ మార్ష్ కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో మిచెల్ మార్ష్ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో మార్ష్‌కు ఇదే తొలి మ్యాచ్. కాగా మిచెల్ మార్ష్ ఐపీఎల్‌లో అడుగుపెట్టి 12 ఏళ్లయింది.
2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కుడైన విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి 12 ఏళ్ల కాలంలో కేవలం 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే ఇదే 12 ఏళ్లలో మార్ష్ ఐదు ఫ్రాంచైజీలు మారాడు. అవే డెక్కన్ చార్జర్స్, పూణే వారియర్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, ఎస్‌ఆర్‌హెచ్...తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో మార్ష్ 21 మ్యాచ్‌ల్లో 225 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment