Australia announce Ashes squad: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ హీరో మిచల్ మార్ష్‌కు చోటు దక్కలేదు. మరో వైపు ఆజట్టు సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాకు రెండు ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లో చోటు దక్కింది.
15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆస్ట్రేలియా బుధవారం(నవంబర్-17) ప్రకటించింది. ఈ ప్రఖ్యాత సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు, 16న ఆడిలైడ్‌లో రెండో టెస్టు, 26న మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు ఆడుతుంది. 2022 జనవరి 5న సిడ్నీలో నాలుగో టెస్టు, పెర్త్‌లో జనవరి 14న జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: టిమ్ పైన్ (సి), పాట్ కమిన్స్ , కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ , నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జో రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్, స్విప్సన్, డేవిడ్ వార్నర్
యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
1882 లో ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లండ్ అనుహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్‌కి ఇదే మొట్టమొదటి విజయం. దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో 'అంత్యక్రియలు జరపగా వచ్చిన బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు’ అంటూ రాసుకొచ్చింది.
1883లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, ఇంగ్లీష్ మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌కి ‘ది యాషెస్’ అనే పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment