Injured Pat Cummins Eyeing Hopeful Return: గాయంతో ఆటకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత పర్యటనకు సిద్ధంగా ఉంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో అతని ఎడమచేతి మణికట్టుకు ఫ్రాక్చరైంది. దీంతో 6 వారాల పాటు విశ్రాంతికే పరిమితమై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
టీమిండియాతో సిరీస్ నాటికి తిరిగి వచ్చేస్తా
అయితే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్‌తో సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో పునరాగమనం చేస్తానని ఆసీస్ సీమర్ చెప్పాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘గాయం మరీ అంత తీవ్రంగా ఏమీలేదు. మరికొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాతో వన్డే సిరీస్‌ల నాటికి అందుబాటులో ఉంటాననే నమ్మకం ఉంది.
వన్డే వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే!
వన్డేల్లో కెప్టెన్సీ కాస్త వేరుగా ఉంటుంది. మెగా టోర్నీ ముగిసిన తర్వాత 50 ఓవర్ ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగే అంశంపై ఆలోచిస్తా. మిచెల్ మార్ష్ రూపంలో మాకు మంచి ఆప్షన్ ఉంది. టీ20లలో అతడు అదరగొడుతున్నాడు. మైదానం లోపలే కాదు.. వెలుపలా మార్ష్ ఎలా ఉంటాడో నాకు తెలుసు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా
గొప్ప వ్యక్తిత్వం కలవాడు. తనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్లను కూడా ఉత్తేజితం చేస్తాడు. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూసుకుంటాడు’’ అని భవిష్యత్తు కెప్టెన్ ఎవరన్న అంశంపై హింట్ ఇచ్చేశాడు. కాగా ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టాడన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు టీమిండియా ఆసీస్‌తో సెప్టెంబరు 22 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
చదవండి: బజ్‌బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం
కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే..
Comments
Please login to add a commentAdd a comment