నాన్నకు చెబితే నమ్మలేదు
ఆసీస్ జట్టులో చోటుపై జో బర్న్స్
మెల్‌బోర్న్: ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న 25 ఏళ్ల బ్యాట్స్‌మన్ జో బర్న్స్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం జట్టులోకి ఎంపికయ్యాననే వార్తను తన తండ్రికి చెబితే ఏమాత్రం నమ్మలేదని అన్నాడు. ‘నా తండ్రి ఈ వార్తను అస్సలు పట్టించుకోలేదు. దీంతో కాస్త నిరాశకు గురయ్యాను. నేను ఆసీస్ క్రికెట్‌కు వీరాభిమానిని. ప్రతీ మ్యాచ్‌ను ఫాలో అవుతాను. నేను అభిమానించే లీమన్ ఆధ్వర్యంలో జట్టుకు ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. ఓరకంగా నా కల నిజమైంది’ అని బర్న్స్ ఆనంద ం వ్యక్తం చేశాడు.