Joe Burns
-
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ జో బర్న్స్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్.. టీ20 వరల్డ్‌కప్ 2026 యూరోపియన్ క్వాలిఫయర్‌లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..కెప్లెర్ వెసెల్స్- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ (1), ఇంగ్లండ్ (15)ఎడ్ జాయ్స్- ఐర్లాండ్ (5), ఇంగ్లండ్ (1)గ్యారీ బ్యాలెన్స్- ఇంగ్లండ్ (4), జింబాబ్వే (1)మార్క్ చాప్మన్- హాంగ్‌కాంగ్ (1), న్యూజిలాండ్ (2)జో బర్న్స్- ఇంగ్లండ్ (4), ఇటలీ (1) -
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సొంతదేశాన్ని వీడి ఇటలీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఇటలీని టీ20 వరల్డ్‌కప్ 2026కు అర్హత సాధించేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ ఏడాది తనువు చాలించిన తన సోదరుడు డొమ్నిక్ బర్న్స్‌కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. డొమ్నిక్ గౌరవార్ధం తన జెర్సీపై 85 నంబర్‌ను ధరించనున్నట్లు వెల్లడించాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్‌లో ఇదే సంఖ్య గల జెర్సీని ధరించినట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఇటలీ పౌరసత్వం కలిగి ఉండటంతో బర్న్స్ ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. పై పేర్కొన్న కారణాలే కాకుండా బర్న్స్ ఆస్ట్రేలియాను వీడేందుకు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అతనికి ఈ ఏడాది (2024-25) తన సొంత దేశవాలీ జట్టైన క్వీన్స్లాండ్ జట్టు కాంట్రాక్ట్ లభించలేదు. అలాగే బిగ్‌బాష్ లీగ్‌తోనూ బర్న్స్ కాంట్రాక్ట్ ముగిసింది. పై పేర్కొన్న కారణాలన్నిటినీ చూపుతూ బర్న్స్ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. 34 ఏళ్ల బర్న్స్ 2014-2020 మధ్యలో ఆస్ట్రేలియా తరఫున 23 టెస్ట్‌లు, 6 వన్డేలు ఆడి 1608 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు (టెస్ట్‌లు), 8 హాఫ్ సెంచరీలు (7 టెస్ట్, ఒకటి వన్డే) ఉన్నాయి.ఇదిలా ఉంటే, ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. ఈ దేశానికి 2026 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. జూన్ 9 నుంచి జరిగే వరల్డ్‌కప్ రీజియనల్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ పోటీల్లో ఇటలీ.. ఫ్రాన్స్, ఐసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లతో పోటీపడుతుంది. -
స్మిత్ పుండుమీద కారం చల్లిన అభిమాని!
క్రైస్ట్ చర్చ్: ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం ఎంత మామూలు విషయమో!.. వారిపై అభిమానులు విమర్శలకు దిగడం అంతే సహజం! తాజాగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, జోస్ బర్న్స్‌పై న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రికెట్ అభిమాని వినూత్న రీతిలో విమర్శలు చేశాడు. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ను వీక్షిస్తున్న సదరు కివీస్ అభిమాని ‘పెద్దగా ఉపయోగంలో లేని క్రికెట్ బ్యాట్లు అమ్మబడును’ అనే ప్లకార్డు ప్రదర్శించాడు. బ్యాట్లు కావాల్సిన వారు స్మిత్, బర్న్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన రెండు టెస్టుల్లోనూ స్మిత్, బర్న్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసిన బర్న్స్, రెండో టెస్టులో తేలిపోయాడు. కేవలం 0,4 పరుగులే చేశాడు. ఇక టెస్టుల్లో కీలక ఆటగాడు స్మిత్ తాజా సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 1,1*,8,0 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పేవల ప్రదర్శన కారణంగా బర్న్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు ఇప్పటికే పక్కన పెట్టేసింది. అసలే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ అభిమాని విమర్శ పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. (చదవండి: అతడి తర్వాత మళ్లీ బుమ్రానే: అక్తర్) -
డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్
సిడ్నీ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టుకు ఆసీస్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ అందుబాటులోకి రానున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో ఆడిన ఓపెనర్ జో బర్న్స్ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్ జట్టు సెలెక్టర్ ట్రేవర్ హోన్స్ తెలిపాడు. ఈ మేరకు మూడు, నాలుగు టెస్టులకు 18 మందితో ఆసీస్ జట్టును ప్రకటించింది. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే.గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. (చదవండి : ‘స్టీవ్ స్మిత్‌పై నాకు నమ్మకం ఉంది’) అయితే వార్నర్ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు.. కానీ గాయం తీవ్రతపై స్పష్టం లేకపోవడంతో మొదటి రెండు టెస్టులకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. వాస్తవానికి జో బర్న్స్ మొదటి రెండు టెస్టుల్లో పర్వాలేదనిపించే ప్రదర్శన నమోదు చేశాడు. బర్న్స్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 8,51*, 0,4 కలిపి 125 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ప్రదర్శన స్థిరంగా ఉండడంతో వార్నర్ కోసం బర్న్స్‌ను పక్కడపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మరోవైపు త్యాగి బౌన్సర్‌తో గాయపడ్డ పుకోవిస్కిని ఎంపిక చేసినా తుది జట్టులోకి వచ్చే దానిపై స్పష్టత లేదని తెలిపింది. కాగా వార్నర్ రాకతో ఆసీస్ కాస్త బలంగా తయారైనట్లు కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై ఘన విజయం సాధించిన ఆసీస్‌కు మెల్బోర్న్లో షాక్ తగిలింది. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో రెండో టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, విల్ పుకోవిస్కీ, మార్కస్ హారిస్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రేవిస్ హెడ్, మాట్ హెన్రిక్స్, టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, సీన్ అబాట్,నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, జోష్ హాజిల్‌వుడ్, జేమ్స్ ప్యాటిన్సన్, మైఖేల్ నాజర్ -
నాన్నకు చెబితే నమ్మలేదు
ఆసీస్ జట్టులో చోటుపై జో బర్న్స్ మెల్బోర్న్: ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న 25 ఏళ్ల బ్యాట్స్‌మన్ జో బర్న్స్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం జట్టులోకి ఎంపికయ్యాననే వార్తను తన తండ్రికి చెబితే ఏమాత్రం నమ్మలేదని అన్నాడు. ‘నా తండ్రి ఈ వార్తను అస్సలు పట్టించుకోలేదు. దీంతో కాస్త నిరాశకు గురయ్యాను. నేను ఆసీస్ క్రికెట్‌కు వీరాభిమానిని. ప్రతీ మ్యాచ్‌ను ఫాలో అవుతాను. నేను అభిమానించే లీమన్ ఆధ్వర్యంలో జట్టుకు ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. ఓరకంగా నా కల నిజమైంది’ అని బర్న్స్ ఆనంద ం వ్యక్తం చేశాడు.