
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ జో బర్న్స్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్.. టీ20 వరల్డ్‌కప్ 2026 యూరోపియన్ క్వాలిఫయర్‌లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
కెప్లెర్ వెసెల్స్- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)
ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ (1), ఇంగ్లండ్ (15)
ఎడ్ జాయ్స్- ఐర్లాండ్ (5), ఇంగ్లండ్ (1)
గ్యారీ బ్యాలెన్స్- ఇంగ్లండ్ (4), జింబాబ్వే (1)
మార్క్ చాప్‌మన్- హాంగ్‌కాంగ్ (1), న్యూజిలాండ్ (2)
జో బర్న్స్- ఇంగ్లండ్ (4), ఇటలీ (1)