క్రైస్ట్ చర్చ్: ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం ఎంత మామూలు విషయమో!.. వారిపై అభిమానులు విమర్శలకు దిగడం అంతే సహజం! తాజాగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, జోస్ బర్న్స్‌పై న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రికెట్ అభిమాని వినూత్న రీతిలో విమర్శలు చేశాడు. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ను వీక్షిస్తున్న సదరు కివీస్ అభిమాని ‘పెద్దగా ఉపయోగంలో లేని క్రికెట్ బ్యాట్లు అమ్మబడును’ అనే ప్లకార్డు ప్రదర్శించాడు. బ్యాట్లు కావాల్సిన వారు స్మిత్, బర్న్స్‌ను సంప్రదించాలని పేర్కొన్నాడు.
కాగా, ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన రెండు టెస్టుల్లోనూ స్మిత్, బర్న్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసిన బర్న్స్, రెండో టెస్టులో తేలిపోయాడు. కేవలం 0,4 పరుగులే చేశాడు. ఇక టెస్టుల్లో కీలక ఆటగాడు స్మిత్ తాజా సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 1,1*,8,0 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పేవల ప్రదర్శన కారణంగా బర్న్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు ఇప్పటికే పక్కన పెట్టేసింది. అసలే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ అభిమాని విమర్శ పుండుమీద కారం చల్లినట్టుగా మారింది.
(చదవండి: అతడి తర్వాత మళ్లీ బుమ్రానే: అక్తర్)
Comments
Please login to add a commentAdd a comment