IPL 2022: Delhi Capitals All Rounder Mitchell Marsh Test Positive for Covid-19 - Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్‌..?

Published Mon, Apr 18 2022 5:22 PM | Last Updated on Mon, Apr 18 2022 6:32 PM

IPL 2022: Delhi Capitals All Rounder Mitchell Marsh Test Positive For Covid - Sakshi

Delhi Capitals All Rounder Mitchell Marsh Test Positive For Covid: ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. మూడు రోజుల కిందట (ఏప్రిల్ 15) జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా ఇద్దరు ఆటగాళ్లు మహమ్మారి బారిన పడ్డారని సమాచారం. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మార్ష్‌కు ఇవాళ ఉదయం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్‌ వచ్చిందని, అనంతరం చేసిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


ఈ ప్రచారాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అని డైలమా కొనసాగుతుంది. మరోవైపు కోవిడ్‌ బారినపడ్డట్టుగా చెబుతున్న ఆ రెండో ఆటగాడు ఎవరో తెలియక అభిమానులు తలలు పట్టుకున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో డీసీ యాజమాన్యం కానీ, ఐపీఎల్‌ వర్గాలు కానీ ఇంతవరకు స్పందించకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యచ్‌ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. 
చదవండి: ఐపీఎల్‌ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement