PC: IPL.com
ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు సభ్యలు కరోనా బారిన పడ్డారు. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు వికెట్ కీపర్ టీమ్ సీఫర్ట్ కరోనా బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్ల అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా తేలడంతో మ్యాచ్ యథావిధిగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కాగా ఏప్రిల్ 22 న వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ క్రమంలో మరోసారి ఢిల్లీ ఆటగాళ్లకి గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ రోజు పరీక్షల్లో కూడా అందరి ఆటగాళ్లకు కరోనా నెగిటివ్‌గా తేలింది. ఇక పూణే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైలోని వాంఖడే స్టేడియంకు బీసీసీఐ మార్పు చేసింది. ఢిల్లీ జట్టులో కరోనా కేసులు నమోదు కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన యార్కర్.. ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్
Comments
Please login to add a commentAdd a comment