
PC:IPL.com/BCCI
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7 వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపనడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ గాయం కారణంగా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు.
అయితే మార్ష్‌కు ఎటువంటి గాయమైందో, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని దాదా వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది సీజన్‌లో మార్ష్ ఇప్పటివరకు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 71 పరుగులు చేసిన మార్ష్.. అటు బౌలింగ్‌లో కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు.
ఇక అతడి స్ధానంలో మరో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఐపీఎల్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కుల్దీప్ కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment