ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా ఓ కీలక మార్పు చేసింది. తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగివెళ్లనున్న జోష్ ఇంగ్లిస్ స్థానంలో ఆన్‌క్యాప్డ్ ఆటగాడు జిమ్మీ పీర్సన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో తొలి టెస్టు ముగిసిన వెంటనే ఇంగ్లిస్ స్వదేశానికి పయనం కానున్నాడు.
ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు జిమ్మీ పీర్సన్ ఆస్ట్రేలియా క్యాంప్‌లో కలవనున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పీర్సన్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ క్వీన్స్‌లాండ్ ఆటగాడు 34.75 సగటుతో 3000 పరుగులు చేశాడు.
అందులో 6 సెంచరీలు ఉన్నాయి. అయితే లోయార్డర్‌లో బ్యాటింగ్ వచ్చి 6 సెంచరీలు సాధించడం విశేషం. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాతోతలపడనుంది. అనంతరం జూన్ 16న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, , మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
చదవండి: IPL 2023: అతడిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment