ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఇటీవలీ కాలంలో తన ఆటను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డే క్రికెట్‌పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసిన రూట్ టి20ల్లోనూ తన పాగా వేసేందుకు ఆటశైలిని మార్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి రూట్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఒక మంచి బ్యాటర్‌గా పేరు పొందిన రూట్ ఈ మధ్య కాలంలో బౌలర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అవతారం ఎత్తినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, ట్రెవిస్ హెడ్‌లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
అదేంటంటే.. యాషెస్ చరిత్రలో బ్యాటింగ్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు.
ఇక తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులు నాటౌట్ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్ హెడ్(77 పరుగులు), డేవిడ్ వార్నర్(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.
Joe Root strikes twice in an over and Australia are 5️⃣ down! #EnglandCricket | #Ashes pic.twitter.com/wmn9hC5K6c
— England Cricket (@englandcricket) June 28, 2023
చదవండి: పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్
Comments
Please login to add a commentAdd a comment