ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.
ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్ గ్రీన్ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.
మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..
బెన్ స్టోక్స్
జేసన్ రాయ్
శిఖర్ ధవన్
అత్యంత పిన్నవయస్కుడు..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్ చిన్నోడు జూనియర్ క్రికెట్‌లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు..
ఉన్ముక్త్ చంద్ (యూఎస్‌ఏ)
అలీ ఖాన్ (యూఎస్‌ఏ)
బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్)
ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..
భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48
విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193
అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3
భారతీయ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు- 318
విదేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు- 12
మొత్తం- 574
వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..
రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లు
రూ. 1.5 కోట్లు- 27
రూ. 1.25 కోట్లు- 18
రూ. కోటి- 23
రూ. 75 లక్షలు- 92
రూ. 50 లక్షలు- 8
రూ. 40 లక్షలు- 5
రూ. 30 లక్షలు- 320
మొత్తం- 574
Comments
Please login to add a commentAdd a comment