PC: IPL.com
ఐపీఎల్-2023లో శనివారం వాఖండే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో గ్రీన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన గ్రీన్.. అనంతరం బ్యాటింగ్‌లో (43 బంతుల్లో 67) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గ్రీన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 64 పరుగులు చేసిన గ్రీన్.. బౌలింగ్‌లో ఒక్క వికెట్ పడగొట్టాడు.
తొలుత విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో కామెరాన్ గ్రీన్‌ను పోటీ పడి మరి రూ.17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం విధితమే. అయితే తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగ అని, జట్టులోని తీసియండి అని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. ఇక గ్రీన్ తన అద్భుత ప్రదర్శనలతో విమర్శలకు చెక్ పెట్టాడు.
అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి. గ్రీన్ అద్భుతమైన ఆల్‌రౌండర్ అని, అతడు తన తీసుకున్న మొత్తానికి న్యాయం చేస్తున్నాడని ముంబై అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ ఆల్‌రౌండర్.. 166 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా
#ArshdeepSingh: జాగ్రత్త.. అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్!
Stump breaker,
— JioCinema (@JioCinema) April 22, 2023
Game changer!
Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
Comments
Please login to add a commentAdd a comment