PBKS Vs MI: Tilak Varma Takes Revenge Vs-Arshdeep Bowling Hitting Sixes - Sakshi
Sakshi News home page

Tilak Varma: గమనించారా.. మ్యాచ్‌తో పాటు పాత పగను కూడా!

Published Thu, May 4 2023 5:10 PM | Last Updated on Thu, May 4 2023 5:23 PM

Tilak Varma Takes Revenge Vs-Arshdeep Bowling Hitting Sixes PBKS Vs MI - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బుధవారం ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. తిలక్‌ వర్మ 10 బంతుల్లో 26 పరుగులు నాటౌట్‌ చివర్లో దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించలేదు. 


Photo: IPL Twitter

అదేంటంటే తిలక్‌ వర్మ ముంబైని గెలిపించడంతో పాటు తన పాత పగను కూడా తీర్చుకున్నాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన తిలక్‌ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో చుక్కలు చూపించాడు. ఇదే సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అర్ష్‌దీప్‌ కారణంగా ఓడిపోయింది. ఆఖర్లో మూడు వికెట్లు తీసి ముంబై విజయాన్ని అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మను క్లీన్‌బౌల్డ్‌ చేసిన అర్ష్‌దీప్‌ విజయనాదం చేస్తూ పెవిలియన్‌ వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో పంజాబ్‌ చేతిలో ఓడింది.

ఇది మనసులో ఉంచుకున్న తిలక్‌ సమయం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు.  అందుకే మళ్లీ అదే పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరైన సమయంలో అర్ష్‌దీప్‌ వేసిన 18.5 ఓవర్లో విన్నింగ్‌ సిక్సర్‌ కొట్టిన తిలక్‌ తన సంతోషాన్ని కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అచ్చం అర్ష్‌దీప్‌ను అనుకరిస్తూ తిలక్‌ చేసిన విజయనాదం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: ముంబై ఇండియన్స్‌కే సాధ్యం.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement