Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సెంచరీతో మెరిశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్ గెలిపించడంతో పాటు తొలి ఐపీఎల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 47 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న కామెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయంతో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉన్నప్పటికి.. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దు అయితే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున కామెరాన్ గ్రీన్‌ది రెండో సెంచరీ కాగా తొలి సెంచరీ సూర్యకుమార్ యాదవ్ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ తరపున గ్రీన్‌ది ఆరో శతకం. ఇంతకముందు సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, లెండిల్ సిమన్స్, సూర్యకుమార్ ఉండగా.. తాజాగా వీరి సరసన కామెరాన్ గ్రీన్ నిలిచాడు.
ఇక ఐపీఎల్ 2023లో గ్రీన్‌ది తొమ్మిదో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ 100 పరుగులు, శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రభసిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు)తో ఉన్నారు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗛𝗔𝗦𝗘!@mipaltan stay alive in #TATAIPL 2023 courtesy of an exceptional batting display and an 8-wicket win over #SRH 👏🏻👏🏻#MIvSRH pic.twitter.com/t1qXyVbkqG
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Comments
Please login to add a commentAdd a comment